Chiranjeevi Gives Green Signal To Boyapati Srinu | Filmibeat Telugu

2018-11-17 363

Megastar Chiranjeevi gives green signal to Boyapati Srinu. After Koratala movie Chiru will going to do with Boyapati
#chiranjeevi
#vinayavidheyarama
#vvrteaser
#staterowdy
#rc12
#ramcharan
#boyapatisrinu

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తిరుగులేని విజయాలతో స్టార్ డైరెక్టర్ గా మారారు. బోయపాటి అంటే మాస్ ఆడియన్స్ కు పండగనే చెప్పొచ్చు. బోయపాటి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఖైదీ నెం 150 తరువాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేది బోయపాటి అనే వార్తలు వచ్చాయి. కానీ సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రారంభం కావడంతో కుదర్లేదు. బాలయ్యకు రెండు సూపర్ హిట్స్ అందించిన బోయపాటి లాంటి దర్శకుడితో పనిచేయాలని చిరు కూడా ఆసక్తిగానే ఉన్నారు. తాజాగా బోయపాటికి చిరు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి తరువాత కొరటాల దర్శత్వంలో చిరు నటిస్తారు. ఆ తరువాత చిత్రానికి కథ సిద్ధం చేయమని చిరు బోయపాటితో అన్నారట.